కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లతో సీహెచ్‌‌‌‌‌‌‌‌ శివలింగయ్య కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌

జనగామ, వెలుగు : కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల కోసం జనగామ జిల్లా నుంచి 199 మంది ఎంపికయ్యారని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌ శివలింగయ్య చెప్పారు. సివిల్, ఏఆర్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌, ఫైర్, ఎక్సైజ్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగాలకు ఎంపికైన జిల్లావాసులతో మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఎంపికైన వారికి బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్లు అందజేయనున్నట్లు చెప్పారు.

క్యాండిడేట్లను తీసుకెళ్లేందుకు ఐదు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, క్యాండిడేట్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకునేందుకు జిల్లా స్థాయి ఆఫీసర్లను సైతం నియమంచినట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పింకేశ్ కుమార్, డీఏవో వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీఈవో రాము, డీఎంవో నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.