మహబూబాబాద్, వెలుగు : రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వడ్లు కొనుగోలు చేయాలని మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. రైతుల మేలు కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
వడ్ల కొనుగోలు పూర్తైన వెంటనే రైతులకు డబ్బులు అందేలా వివరాలను నమోదు చేయాలని చెప్పారు. టార్పాలిన్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రివ్యూలో డీసీవో సయ్యద్ ఖుర్షీద్, డీఎస్‌వో రవీందర్, సివిల్ సప్లై మేనేజర్ కృష్ణవేణి, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, జీసీసీ జిల్లా మేనేజర్ సమ్మయ్య, ఐకేపీడీపీఎం నళిని, మెప్మా కోఆర్డినేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.