ఎలక్షన్​ టీమ్స్  పక్కాగా డ్యూటీ చేయాలి: వల్లూరు క్రాంతి

ఎలక్షన్​ టీమ్స్  పక్కాగా డ్యూటీ చేయాలి: వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు: ఎలక్షన్  టీమ్స్  పక్కాగా డ్యూటీ చేయాలని గద్వాల కలెక్టర్  వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో ఎన్ఎన్టీ, ఎఫ్ఎస్టీ, వీవీఎస్టీ టీమ్​లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలర్ట్ గా ఉంటూ ప్రతి అంశాన్ని వీడియో తీయాలన్నారు. లిక్కర్, క్యాష్  రాకుండా బార్డర్  చెక్ పోస్ట్ లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 24 గంటలు ఫ్లయింగ్ స్క్వాడ్స్ డ్యూటీలో ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాస్, ఆర్డీవో చంద్రకళ ఉన్నారు.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

పొలిటికల్ పార్టీల లీడర్లు నామినేషన్  వేసేందుకు 48 గంటల ముందే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్  మీటింగ్  హాల్లో నామినేషన్లపై పొలిటికల్  పార్టీ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే రిటర్నింగ్  ఆఫీసర్లను ముందుగానే సంప్రదించాలన్నారు.

కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయాలి..

నాగర్ కర్నూల్ టౌన్: కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  ఉదయ్ కుమార్  అధికారులను ఆదేశించారు. నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రిసెప్షన్, కౌంటింగ్‌‌‌‌  సెంటర్​ను పరిశీలించారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల కౌంటింగ్‌‌‌‌ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ నెల10 లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్‌‌‌‌ సీతారామారావు, ఆర్డీవో వెంకట్ రెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్‌‌‌‌, మున్సిపల్  కమిషనర్  జయంత్ కుమార్ రెడ్డి, మిషన్  భగీరథ ఈఈ శ్రీధర్ రావు పాల్గొన్నారు. 

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

వనపర్తి, వెలుగు: ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పీవో, ఏపీవోలు కృషి చేయాలని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  సూచించారు. పట్టణంలోని గర్ల్స్​ హైస్కూల్​లో పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓటరు జాబితా, ఈవీఎం నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జాకీర్ హుస్సేన్, నుషితా, మల్లికార్జున్  పాల్గొన్నారు.

రూల్స్​ పాటించాలి..

మక్తల్: పొలిటికల్​ పార్టీల లీడర్లు ఎన్నికల రూల్స్​ పాటించాలని అడిషనల్​ కలెక్టర్  మయాంక్  మిత్తల్  సూచించారు. తహసీల్దార్​ ఆఫీస్ లో  రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల దాఖలు సమయంలో నిబంధనలు పాటించాలని, సీ విజల్ యాప్  ద్వారా ఏవైనా ఫిర్యాదులు ఉంటే చేయవచ్చన్నారు. తహసీల్దార్​ సువర్ణ రాజు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.