ప్రజాపాలన విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ప్రజాపాలన విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ములుగు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల పేరిట నవంబర్ 29న నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర పిలుపునిచ్చారు. ములుగు డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో కార్యక్రమ నిర్వహణపై అడిషనల్​కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. నవంబర్ 29న ‘ప్రజా ప్రభుత్వం పిలిచింది’ పేరుతో అంతడుపుల నాగరాజు సారథ్యంలో ములుగు జిల్లాకు విచ్చేసి వివిధ కళా ప్రదర్శనలు చేయనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమానికి  మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో డీఈవో పాణినీ, డీఎంహెచ్ వో  గోపాల్ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా,  ములుగు జిల్లా రైతులు వానాకాలం సీజన్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ముందు 17 శాతం తేమ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ దివాకర్ ఒక ప్రకటనలో కోరారు. తూకం విషయంలో కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లుల్లో ఇబ్బందులకు గురిచేసినా, కోత విధించినా రైతులు 9347416178 కు తెలుపాలని సూచించారు.