గ్రామాల్లో జీవనోపాధి అవకాశాలను గుర్తించాలి : కలెక్టర్ దివాకర్

ఏటూరునాగారం, వెలుగు: గ్రామాల్లో జీవనోపాధి కల్పించే అవకాశాలను గుర్తించాలని ములుగు కలెక్టర్ దివాకర్ అన్నారు. శనివారం ములుగు కలెక్టరేట్​లో  అడిషనల్​ కలెక్టర్ శ్రీజతో కలిసి తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్థానిక వనరులు, సమస్యలు, ఎన్ని విధాలుగా జీవనోపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయో, స్థానిక యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వంటి తదితర అంశాలపై సర్వే నిర్వహించాలని సూచించారు.

మహిళలకు, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి ఆవశ్యకత ఉంటుందో గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.