చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక

  •     గురుకుల జోనల్ స్పోర్ట్స్ మీట్ లో  కలెక్టర్ డాక్టర్ ప్రియాంక                    

ములకలపల్లి, వెలుగు ; చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. ములకలపల్లిలోని    గురుకుల బాలికల పాఠశాలలో మూడు రోజులపాటు జరిగే 9వ జోనల్ క్రీడా పోటీలను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఆడపిల్లల చదువు కోసం ప్రభుత్వాలు ప్రత్యేక పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశాయన్నారు.

వీటిని సద్వినియోగం చేసుకొని చదువుల్లో  రాణించి కుటుంబానికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సూచించారు. చదువే ఆడపిల్లలకు గుర్తింపును తెస్తుందని, తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను తప్పనిసరిగా స్కూల్​కు పంపాలన్నారు. చదువుతో ఆత్మ విశ్వాసం పొందవచ్చన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కు క్రీడాకారులు గౌరవ వందనం చేశారు.  కార్యక్రమంలో డీఐఈ ఓ సులోచనరాణి,  స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామ రెడ్డి, గురుకుల పాఠశాల అధికారి సక్రునాయక్,  ప్రిన్సిపాల్ సునీత, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో శ్రీను, ఎంఈఓ శ్రీరామ్మూర్తి,  తదితరులు పాల్గొన్నారు.