ఇంటర్​ స్టూడెంట్లకు ఫ్రీగా స్టడీ మెటీరియల్ : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్మీడియేట్​ చదువుతున్న పేద స్టూడెంట్స్​ కోసం మ్యాథ్స్​ మెటీరియల్​ను రూపొందించి ఫ్రీగా ఇస్తున్న పుస్తక రచయిత టి.హరిబాబును కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల అభినందించారు. కలెక్టరేట్​లో శనివారం ఏర్పాటు చేసిన మ్యాథ్స్​ 1బి, 2బి పుస్తకాలను కలెక్టర్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేజీబీవీ స్టూడెంట్స్​తో పాటు జిల్లాలోని గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్​కు బుక్స్​ పంపిణీ చేయడం హర్షనీయమన్నారు.

మ్యాథ్స్​లోఎక్కు వ మార్కులు వచ్చేందుకు ఈ బుక్స్ ​దోహదపడుతాయన్నారు. యారో ఎంటర్​ ప్రైజెస్​ సహకారంతో  మ్యాథ్స్​ 1బి, 2బి మెటీరియల్​ను స్టూడెంట్స్​కు పంపిణీ చేయనున్నట్టు పుస్తక రచయిత, లెక్చరర్​ టి. హరిబాబు తెలిపారు. ప్రోగ్రాంలో ఇంటర్మీడియేట్​ జిల్లా అధికారి సులోచనరాణి పాల్గొన్నారు.