ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం 40,420 దరఖాస్తులు : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40,420 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 29,991 మంది ఆన్​లైన్​, 429 మంది ఆఫ్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా కొత్తగూడెంలో 4,682, పాల్వంచలో 4,677 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

మణుగూరులో 131 మంది దరఖాస్తు చేసుకోగా ఆళ్లపల్లి, కరకగూడెం, సుజాతనగర్​, అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం మండలాల నుంచి ఒక్కరూ కూడా ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోలేదు.