స్ట్రాంగ్​ రూమ్స్ వద్ద పటిష్ట బందోబస్తు : ప్రియాంక అలా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్ట్రాంగ్​రూమ్​ వద్ద పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లను కలెక్టర్ ​డాక్టర్​ ప్రియాంక అలా ఆదేశించారు. కొత్తగూడెంలోని ఈవీఎం వేర్ హౌజ్​ నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​ రూంలకు పంపుతున్న ఈవీఎం, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్​యూనిట్లను శనివారం ఆమె పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్​ రూంలలో వాటిని భద్రపర్చాలన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూంకు సీలు వేయాలన్నారు. 

ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలన్నారు. అలాగే కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​ రూంను శనివారం కలెక్టర్ ప్రారంభించారు. ప్రొగ్రాంలో డీఆర్డీవో మధుసూదనరాజు, సహకార శాఖాధికారి వెంకటేశ్వర్లు, డీపీఆర్​ఓ శ్రీనివాస్​ పాల్గొన్నారు.