చిన్నచింతకుంట, వెలుగు : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలని కలెక్టర్ జి. రవినాయక్ కోరారు. ఈ నెల 14 నుంచి 29 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం టెంపుల్ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కమిటీలు తమకు కేటాయించిన డ్యూటీలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు పని చేసేలా సిబ్బందిని నియమించాలని సూచించారు. అన్నిరకాల సౌలతులు కల్పించాలని, అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ ఎస్పీ రాములు, అడిషనల్ కలెక్టర్ యాదయ్య,
టెంపుల్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈలు వెంకటరమణ, జగన్మోహన్, ఈఈలు పుల్లారెడ్డి, మేఘారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డీపీ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో మధునేశ్వర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ వీరారెడ్డి, ఆర్డీవో అనిల్ కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ALSO READ : ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : చౌహాన్