
- సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్
గజ్వేల్(వర్గల్), వెలుగు : ప్రభుత్వాసుపత్రులలో అందుతున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్గరిమా అగర్వాల్సూచించారు. మంగళవారం వర్గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో 134 రకాల రక్తపరీక్షలు నిర్వహించి మహిళల్లో ఏర్పడే 8 రకాల వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చునన్నారు.
రుతుప్రేమలో భాగంగా ప్రతి ఒక్కరూ మెనుస్ట్రువల్కప్పులనే వాడాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన నిర్మాణాన్ని గజ్వేల్ పీఆర్డీఈఈ ప్రభాకర్తో కలిసి పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని గిర్మాపూర్, సింగాయిపల్లి గ్రామ పంచాయతీలలో రికార్డులను పరిశీలించారు.
పల్లె ప్రకృతి వనాలు బాగున్నయ్..
ములుగు, వెలుగు : గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు చాలా బాగున్నాయని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మండల కేంద్రంలోని జప్తిసింగాయిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం, నర్సరీలు, గ్రామపంచాయతీలను ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు.