
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు : కృషి, పట్టుదల, క్రమశిక్షణే విజయానికి కారణమని పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పరచుకొని మేడ్చెల్ – మల్కాజిగిరి కలెక్టర్ గౌతం విద్యార్థులకు సూచించారు. బోధించారు. మంగళ వారం శామీర్ పేట మండలంలోని తుర్కపల్లి లోని మహత్మా జ్యోతిబా పూలే స్కూల్, కాలేజీని కలెక్టర్ గౌతం తనిఖీ చేశారు. అనంతరం పదవ తరగతిలోని ప్రతి స్టూడెంట్లతో మాట్లాడారు.
భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏగ్రూపు తీసుకుంటారని తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు. డైనింగ్ రూమ్లో టేబుల్లు, కుర్చీలు సరిపడా ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ కు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు యాదిరెడ్డి, ఎంపీడీవో మమతా బాయ్ డి సి ఓ రాజేష్ ఆర్ సి ఓ వెంకటేశ్వరరావు ప్రిన్సిపల్ షీలా, తదితరులు పాల్గొన్నారు.