- కలెక్టర్ గౌతమ్ఖ
ఖమ్మం టౌన్,వెలుగు: ఈవీఎంల భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం జడ్పీ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాకు అదనపు ఈవీఎంలు బుధవారం వచ్చాయన్నారు. ఇందులో 501 బ్యాలెట్ యూనిట్లు, 369 కంట్రోల్ యూనిట్లు, 163 వీవీప్యాట్ లు ఉన్నాయన్నారు. అనంతరం ఎఫ్ఎల్సీ ఏర్పాట్లను సీపీ విష్ణు వారియర్ తో కలిసి పరిశీలించారు. రూ. 2.78 కోట్లతో నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
అభివృద్ధి పనులపై సమీక్ష
కలెక్టరేట్లో అధికారులతో సీఎం ఆస్యూరెన్స్ నిధుల పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 90.94 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. పనుల ప్రారంభానికి టెండర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను
ఆదేశించారు.