ఎలక్షన్ డ్యూటీని పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ గోపి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎలక్షన్​ డ్యూటీని పకడ్బందీగా చేయాలని ఆఫీసర్లను  కలెక్టర్ గోపి ఆదేశించారు.  బుధవారం  కలెక్టరేట్ లో  సీపీ సుబ్బారాయుడుతో కలిసి  ఎన్నికల విధులపై జిల్లా అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాలిడేస్​తో సంబంధం లేకుండా చెక్ పోస్టుల్లో నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎఫ్​ఎస్టీ, వీఎస్టీ వెహికల్స్ కు  జీపీఎస్ ఏర్పాటు చేయాలన్నారు.   ప్రభుత్వ కార్యక్రమాల్లో  పార్టీల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన బ్యానర్లను  వెంటనే తొలగించాలన్నారు.  క్షేత్రస్థాయిలో వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.  సమావేశంలో  అడిషనల్ కలెక్టర్లు  ప్రపుల్  దేశాయ్,  లక్ష్మీ కిరణ్,  రాజు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,తదితరులు పాల్గొన్నారు.
 
నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

 చొప్పదండి, వెలుగు:  నామినేషన్ల  ప్రక్రియ కోసం తగిన wఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు జిల్లా ఎన్నికల అధికారి డా. గోపి సూచించారు. బుధవారం చొప్పదండి నియోజకవర్గ ఆర్వో ఆఫీసులో  ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు  నామినేషన్ వేసే వారితో పాటు మరో నలుగురిని అనుమతించాలన్నారు.

నామినేషన్ ప్రక్రియను వీడియో తీయించాలన్నారు. ఉదయం 11 గం.ల కంటే ముందు మధ్యాహ్నం 3:00 గంటల తరువాత నామినేషన్లను స్వీకరించరాదని ఆదేశించారుw.  కార్యక్రమంలో ఆర్వో ప్రఫుల్ దేశాయ్, తహసీల్దార్​ నరేందర్, సీఐ రవీందర్,  మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

ALS0 READ: కరీంనగర్ బీజేపీలో పలువురి చేరిక