గ్రూప్-4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

గ్రూప్-4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: గ్రూప్ 4 ఎగ్జామ్స్​కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  గుగులోత్​ రవినాయక్  ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్  మీటింగ్ హాల్​లో సంబంధిత ఆఫీసర్స్ తో రివ్యూ నిర్వహించారు. ఎలాంటి తప్పిదం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్  కె.సీతారామారావు, ఆఫీసర్స్ పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ టౌన్: గ్రూప్‌-4 పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌  పి ఉదయ్ కుమార్  ఆదేశించారు. 

కలెక్టరేట్  మీటింగ్  హాల్​లో నిర్వహించిన సమావేశంలోఆయన మాట్లాడుతూ 16,637 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, 50 సెంటర్స్​ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరం సెంటర్లలోకి అనుమతించాలని సూచించారు. 396 మంది దివ్యాంగులు హాజరవుతున్నారని, వారికి భవనంలోని కింది ఫ్లోర్‌లో గదులు కేటాయించాలన్నారు. నాగర్ కర్నూల్​లో 18, బిజినేపల్లిలో 3, బల్మూరులో 2, అచ్చంపేటలో 8, కల్వకుర్తిలో 11, వెల్దండలో 1, తెలకపల్లిలో4, తిమ్మాజీపేటలో 2, పెద్దకొత్తపల్లిలో ఒకటి చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

గద్వాల: జిల్లాలో గ్రూప్ 4 ఎగ్జామ్స్​కు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో చీఫ్​ సూపరింటెండెంట్లు, లైజనింగ్, రూట్  ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. 49 సెంటర్లలో 14,920 మంది అభ్యర్థులు ఎగ్జామ్  రాయనున్నట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్  అపూర్వ్  చౌహాన్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.