జడ్చర్ల టౌన్, వెలుగు: పోలింగ్ కేంద్రాల్లో సౌలతులు కల్పించాలని కలెక్టర్ గుగులోత్ రవినాయక్ ఆదేశించారు. శనివారం జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. సౌలతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఒకే ఇంట్లోని ఓటర్లంతా ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలన్నారు.
జడ్చర్ల కావేరమ్మపేట ప్రైమరీ స్కూల్, మండలం ఆల్వాన్ పల్లిలోని 191వ పోలింగ్ స్టేషన్, తంగెళ్లపల్లి స్కూల్, నసరుల్లాబాద్ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ ఎస్ మోహన్ రావు, ఎంఈవో మంజుల, డిప్యూటీ తహసీల్దార్ రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలి
నారాయణపేట: సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మండలాల వారీగా వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఓటర్లను ప్రలోభాలు గురి చేసే వ్యక్తుల పై దృష్టి పెట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచాలని సూచించారు.
ప్రతి వెహికల్ చెక్ చేయాలి
కేటిదొడ్డి: కర్నాటక సరిహద్దులో ప్రతి వెహికల్ ను పక్కాగా తనిఖీ చేయాలని ఎస్పీ రితిరాజ్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం మండలంలోని నందిని చెక్ పోస్ట్ ను ఆమె పరిశీలించారు. వెహికల్ తనిఖీలను పెంచాలని నగదు, లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ కాకుండా నిఘా పెట్టాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటేశ్ ఉన్నారు.