విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ హనుమంతు జెండగే 

యాదాద్రి, వెలుగు :  హాస్టల్స్​ను నిరంతరంగా పర్యవేక్షించడంతో పాటు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ హనుమంత్ జెండగే ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరిగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్స్​, గురుకులాల పనితీరుపై కలెక్టరేట్​లో శుక్రవారం ఆయన రివ్యూ నిర్వహించారు. హాస్టల్​ రూమ్స్, పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంట గదితో పాటు డైనింగ్​ హాల్ పరిశుభ్రత ముఖ్యమని సూచించారు. వంట సరుకులను ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడుకోవద్దన్నారు. వానాకాలంలో వాటర్ వల్ల డయేరియా తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.

ట్యాంకుల క్లీనింగ్, బ్లీచింగ్ నిర్వహాణ పట్ల రిజిష్టర్స్ నిర్వహించాలని, ప్రతీ రెండు వారాలకు ఒక సారి ట్యాంకులను కడిగించాలని సూచించారు. వసతి గృహాల విజిటర్ల రిజిష్టర్లను తనిఖీ చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. హాస్టళ్ల​లో మెడికల్ క్యాంపులు, వైద్యుల విజిట్లు నిర్వహించాలని, గురుకులాలలోని ఏఎన్​ఎంల పనితీరు, వారి వద్ద మందుల వివరాలు, రిజిష్టర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్​డీవో ఎంఏ కృష్ణన్, డీఎంహెచ్​వో పాపారావు, డీపీవో సునంద, వెల్ఫేర్​ ఆఫీసర్లు శ్యాంసుందర్, యాదయ్య, జైపాల్​ రెడ్డి ఉన్నారు. 

ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి 

భూదాన్ పోచంపల్లి : పెండింగ్ లో ఉన్న ధరణి అప్లికేషన్లను  త్వరగా పరిష్కరించాలని జిల్లా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే ఆదేశించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి తహసీల్దార్​కార్యాలయాని ఆయన సందర్శించారు. ధరణి ఫైల్స్ పై పెండింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నాడు. రిజిస్ట్రేషన్ల  సరళిని పరిశీలించాడు . ఆయన వెంట తహసీల్దార్​ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ వెంకట్ రెడ్డి ఉన్నారు.