డిసెంబర్​ 30న తుది ఓటరు జాబితా : కలెక్టర్ హనుమంత్ జెండగే 

డిసెంబర్​ 30న తుది ఓటరు జాబితా : కలెక్టర్ హనుమంత్ జెండగే 

యాదాద్రి, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల తుది ఓటరు జాబితాను  డిసెంబర్​30న విడుదల చేస్తామని కలెక్టర్ హనుమంత్ జెండగే తెలిపారు. ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాపై బుధవారం కలెక్టరేట్​లో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రివిజన్ షెడ్యూల్ విడుదల చేశామన్నారు.

నవంబర్ 6 వరకు ఫారమ్ 19 దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ చేసి మార్పులు, తొలగింపులు, చేర్పులకు డిసెంబర్​9 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 17 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం ద్వారా జనవరి 6న తుది ఓటరు జాబితా రిలీజ్ చేస్తామన్నారు.

ఈనెల 29న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాపై నవంబర్ 28 వరకు మార్పులు, చేర్పుల కోసం అప్లికేషన్లను తీసుకుంటామన్నారు. డిసెంబర్ 24 అప్లికేషన్లను పరిష్కరిస్తామని చెప్పారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల గత తుది ఓటర్ల జాబితా రిలీజ్ తర్వాత వచ్చిన13,391 అప్లికేషన్లలో 8605 ఆమోదించి, 2407 తిరస్కరించామన్నారు. 2377 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఏర్పాటు చేయాలి..

ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను​ఆదేశించారు. ఈ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో  పూర్తి అయిన పనుల ఎంబీ రికార్డులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.  

ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని సూచించారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో అడిషనల్​కలెక్టర్​గంగాధర్, డీఆర్డీవో నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవోలు, వివిధ రాజకీయ పార్టీల లీడర్లు పాల్గొన్నారు.