కౌంటింగ్​ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ హనుమంత్ జెండగే

  • కలెక్టర్ హనుమంత్ జెండగే 

యాదాద్రి, వెలుగు : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ జెండగే అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించి మాట్లాడారు.

కౌంటింగ్ ప్రక్రియలో ఓటు గోప్యత చాలా ముఖ్యమని, ఈవీఎంల తరలించడంతోపాటు వాటికి సీల్​వేసే ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటించాలని సూచించారు. కౌంటింగ్ కమ్యూనికేషన్ ప్లాన్, కౌంటింగ్ ఏజెంట్ల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లు, సీల్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు చేశారు.

సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు​బెన్ షాలోమ్, గంగాధర్, ఆర్డీవో అమరేందర్, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు సుబ్రహ్మణ్యం, పూర్ణచందర్, బీఎస్.లత, కొమరయ్య, అనంతరెడ్డి, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.