
యాదాద్రి, వెలుగు : మెనూ అమలు చేయని ఎస్టీ హాస్టల్ వార్డెన్ విజయలక్ష్మిపై యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెన్షన్ వేటు వేశారు. మంగళవారం భువనగిరిలోని ఎస్టీ పోస్ట్‌మెట్రిక్ హాస్టల్‌ను కలెక్టర్ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత నెలలోనే పాత మెనూ అమలు చేస్తున్న విషయం తెలుసుకొని వార్డెన్‌కు విజయలక్ష్మికి షోకాజ్‌నోటీసు జారీ చేశారు. షోకాజ్‌నోటీసులు ఇచ్చినా మారకపోవడంతో వార్డెన్ విజయలక్ష్మిని సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బొమ్మలరామారం పంచాయతీ సెక్రటరీ..
యాదగిరిగుట్ట: విధుల్లో నిర్లక్ష్యం వహించడం, గ్రామ పంచాయతీ రికార్డులను సైతం సక్రమంగా నిర్వహించకపోవడంతో బొమ్మలరామారం పంచాయతీ సెక్రటరీ పద్మజను సస్పెండ్ చేసినట్లు డీపీవో సునంద తెలిపారు. మంగళవారం బొమ్మలరామారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని డీపీవో ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో విలేజ్ సెక్రటరీ పద్మజ డ్యూటీకి ఆలస్యంగా వచ్చారు. అంతేకాకుండా జీపీ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవంతో పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేసినట్లు డీపీవో వెల్లడించారు.
గుర్రంపోడు తహసీల్దార్ కిరణ్ కుమార్..
హాలియా : విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసిన గుర్రంపోడు తహసీల్దార్ జి.కిరణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుర్రంపోడ్ తహసీల్దార్ విజ్ఞప్తి మేరకు గత నెల 6 నుంచి 16 వరకు కలెక్టర్ సెలవు మంజూరు చేశారు. అయితే సెలవు ముగిసిన తర్వాత జనవరి 17న విధుల్లో చేరాల్సి ఉండగా, కిరణ్ కుమార్ సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు.
మరోసారి ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు సెలవులు పొడిగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వెంటనే విధుల్లో చేరాలని జిల్లా అధికారులు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంతో వివరణ ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గానుగబండ పంచాయతీ కార్యదర్శి..
గరిడేపల్లి : మండల పరిధిలోని గానుగబండ పంచాయతీ కార్యదర్శి ఇంద్రబాబును సూర్యాపేట జిల్లా కలెక్టర్ మంగళవారం సస్పెండ్ చేశారు. ఇటీవల హుజూర్నగర్ లో మిషన్ భగీరథ నీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భగీరథ నీటి సరఫరా విషయంపై సంబంధిత అధికారులు అందించిన నివేదికకు, గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన వివరణకు పొంతనలేకపోవడంతో ఇంద్రబాబును కలెక్టర్ సస్పెండ్ చేశారు.