అన్ని దానాల కన్నా.. విద్యాదానం గొప్పది : కలెక్టర్ హనుమంత్ రావు 

యాదాద్రి వెలుగు : అన్ని దానాల కన్నా.. విద్యాదానం గొప్పదని యాదాద్రి భువనగిరి కలెక్టర్ కె.హనుమంతరావు అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని 188 పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు దివిస్ లాబోరేటరీ కంపెనీ యాజమాన్యం, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. యాజమాన్యం విద్యార్థులకు వాటర్ ప్లాంట్స్, స్టడీ మెటీరియల్స్ అందించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, దివిస్ యాజమాన్యం కిశోర్ కుమార్, కార్యాలయ సహాయ సంచాలకుడు ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.