ఫార్ములాలు గుర్తుంటే..  మ్యాథ్స్​లో మంచి మార్కులు : కలెక్టర్ హనుమంతరావు

ఫార్ములాలు గుర్తుంటే..  మ్యాథ్స్​లో మంచి మార్కులు : కలెక్టర్ హనుమంతరావు
  • కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు: గణితంలో ఫార్ములాలు గుర్తుంటే మంచి మార్కులు సాధించవచ్చని యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం బొమ్మలరామారం హైస్కూల్ లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పారు. కొన్ని ఫార్ములాలు నేర్పించిన కలెక్టర్.. అడిగిన వెంటనే ఫార్ములాలను చెప్పిన నవ్య, సాయి హర్షిత్ ను  అభినందించారు.

గణితంలో ఫార్ములాలతో ఎంత కష్టమైన ప్రాబ్లమ్​కు అయినా సొల్యూషన్ లభిస్తుందన్నారు. విద్యార్థులు ఫార్ములాలను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగవచ్చని, తద్వారా తల్లిదండ్రులు కూడా మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.

 ప్రతి గింజను కొంటాం

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులు, మిల్లర్లను ఆయన ఆదేశించారు.

రైతుల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేసి, రైతులు అమ్మిన వడ్లను వెంటనే మిల్లులకు పంపాలన్నారు. లారీలలో మిల్లులకు పంపిన వడ్లను మిల్లర్లు వెంటనే దించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేశ్యానాయక్, పీఏసీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.