ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి : హనుమంతరావు

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి  : హనుమంతరావు
  • కలెక్టర్ హనుమంతరావు

భూదాన్ పోచంపల్లి, వెలుగు : లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వారం రోజుల్లో 40 ఇండ్లు బేస్మెంట్​వరకు పూర్తయినందున అధికారులను కలెక్టర్ అభినందించారు. 

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు రాములు స్పందిస్తూ తనకు బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలు ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తి కాగానే ఎమ్మెల్యేను, మిమ్మల్ని గృహ ప్రవేశానికి పిలుస్తానని, తప్పనిసరిగా రావాలని కలెక్టర్ ను కోరాడు. ఆయన వస్తానని చెప్పడంతో లబ్ధిదారుడు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్​ వెంట అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.