మెనూ అమలు చేయని వార్డెన్​కు నోటీసులు : కలెక్టర్ హనుమంతరావు

మెనూ అమలు చేయని వార్డెన్​కు నోటీసులు : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, రాజాపేట, వెలుగు : మెనూ సరిగ్గా అమలు చేయని ఎస్టీ హాస్టల్​ వార్డెన్​కు కలెక్టర్ హనుమంతరావు షోకాజ్​నోటీసు జారీ చేశారు. భువనగిరిలో ఎస్టీ బాలికల హాస్టల్​ను మంగళవారం రాత్రి కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. స్టూడెంట్స్ ను అడగడంతో మెనూ సరిగ్గా అమలు చేయడం లేదని తేలింది. దీంతో వెంటనే వార్డెన్​విజయలక్ష్మికి షోకాజ్​నోటీసు జారీ చేశారు. హాస్టల్​లోని వంటగదికి వెళ్లిన ఆయన సరుకుల నాణ్యతను పరిశీలించారు. కోడిగుడ్ల సైజుతోపాటు పప్పు నాణ్యతను పరిశీలించారు. స్టూడెంట్స్​ కోరిక మేరకు కంప్యూటర్లను, లైబ్రరీని ఏర్పాటు చేస్తానని తెలిపారు. స్టూడెంట్స్​ సౌకర్యం కోసం హైదరాబాద్​ చౌరస్తా వద్ద బస్సులు ఆపాలని ఆర్టీసీ డీఎంను కలెక్టర్ ఆదేశించారు. 

పాఠాలు చెప్పిన కలెక్టర్..

రాజాపేట మండలం నెమిల స్కూల్​ను కలెక్టర్ సందర్శించారు. పదో తరగతి స్టూడెంట్స్​తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మ్యాథ్స్ లెసెన్​ చెప్పారు. అనంతరం అంగన్​వాడీ స్కూల్​ను సందర్శించి సెంటర్​లో ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. సెంటర్​లోని పిల్లలు సరైన బరువు ఉన్నారో..లేదో..? చూశారు.