పిల్లలతో పని చేయిస్తరా... ప్రిన్సిపాల్​పై కలెక్టర్ ​సీరియస్, షోకాజ్ ​నోటీసు జారీ

పిల్లలతో పని చేయిస్తరా... ప్రిన్సిపాల్​పై కలెక్టర్ ​సీరియస్, షోకాజ్ ​నోటీసు జారీ

యాదాద్రి, వెలుగు : పిల్లలతో పని చేయిస్తరా.? వారి హెల్త్​పై శ్రద్ధ చూపరా..? అంటూ యాదాద్రి కలెక్టర్​హనుమంతరావు సీరియస్​ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్​రాజాకు షోకాజ్​నోటీసు జారీ చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలోని జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పరిసరాలు క్లీన్​గా లేకపోవడం గమనించారు. ముందుగా స్టూడెంట్స్​ను కలిసి హాస్టల్​ పరిస్థితులపై ఆరా తీశారు. స్వచ్ఛ భారత్​పేరుతో తమతో పని చేయిస్తున్నారని కలెక్టర్​కు స్టూడెంట్స్​తెలిపారు. కోతుల  కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు. శుభ్రమైన వాటర్ రాకపోవడం వల్ల తమకు దురద కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాత్రూంలో లైట్లు లేవని, చీకటిగా ఉండడం వల్ల అందులోకి వెళ్లాలంటే భయమవుతుందని వివరించారు. లైట్లు, ఫాన్లు కాలిపోతే తమ వద్ద డబ్బులు తీసుకొని రిపేర్ చేయిస్తున్నారని తెలిపారు. ఒక్కోసారి తమతో స్టాఫ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అనంతరం స్కూల్​బిల్డింగ్​ పైకి ఎక్కిన కలెక్టర్​ వాటర్ ట్యాంక్​మూత తీయించి చూడగా వాటర్​లో చనిపోయిన జెర్రీ కన్పించింది.

దీంతో సీరియస్​గా అయిన కలెక్టర్​, ప్రిన్సిపాల్​ రాజాకు వెంటనే షోకాజ్​నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కిచెన్ వద్దకు వెళ్లిన ఆయన స్టాక్​ను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్, స్టాఫ్ తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.  స్టూడెంట్స్​తో ఎవరూ దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్టూడెంట్స్​తో పని చేయిస్తారా.? అంటూ ప్రశ్నించారు. వారితో మంచిగా మాట్లాడి చదువు చెప్పాలని ఆదేశించారు. ఆయన వెంటన ఆర్డీవో శేఖర్​ రెడ్డి ఉన్నారు.