
- ఆఫీసర్లకు కలెక్టర్ఆదేశాలు
యాదాద్రి, వెలుగు : ప్రజలు ఎదుర్కొటున్న సమస్యలను తెలుసుకోవడానికి గ్రామాల్లో తిరగాలని, పల్లె నిద్ర చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతిపై మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ఎండలు తీవ్రమైనందున తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని, చేతిపంపులు, బోరు బావులను మరమ్మతులు చేయించాలన్నారు.
సమస్య తీవ్రత ఉన్నచోట ఇతరుల బోరు బావులను కిరాయికి తీసుకోవాలని సూచించారు. అర్హులైనవారినే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా గుర్తించాలన్నారు. పూరి గుడిసె, ఇండ్ల పైకప్పులు సరిగాలేని వారికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన భూభారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ప్రింట్ చేయించి గ్రామాల్లో పబ్లిసిటీ చేయాలని సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. మీటింగ్‌లో అడిషన్ కలెక్టర్వీరారెడ్డి, సీఈవో శోభారాణి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్పాల్గొన్నారు.