- ప్రైవేట్ ల్యాబ్‌కు రిఫర్‌చేసిన ఎల్టీ సస్పెన్షన్
- శానిటైజేషన్ నిర్వహణపై ఏజెన్సీకి మెమో
యాదాద్రి, వెలుగు : జిల్లా ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సీరియస్అయ్యారు. ల్యాబ్టెక్నీషియన్ను సస్పెండ్ చేశారు. శానిటైజేషన్ ఏజెన్సీకి మెమో జారీ చేశారు. మంగళవారం భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఎమర్జెన్సీ వార్డులో కలియతిరిగారు. వైద్య సేవల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లు ఇబ్బందిని గమనించి వీల్‌చైర్స్ పంపించాలని టీజీఎంఐడీసీ ఎండీకి ఫోన్ చేసి కోరారు.
పేషెంట్లతోపాటు వచ్చే విజిటర్స్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. ఇదే సమయంలో సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) రిపోర్ట్తీసుకొని ఓ మహిళ ఎదురొచ్చింది. ఆమె వద్ద ప్రైవేట్ ల్యాబ్‌లో టెస్ట్‌లు చేయించిన రిపోర్ట్ఉండడంతో సదరు మహిళను టెస్ట్ లు బయట ఎందుకు చేయించారని అని ప్రశ్నించారు. దీంతో ఇక్కడి డాక్టర్లే బయట చేయించుకోమని చెప్పారని మహిళ జవాబివ్వడంతో కలెక్టర్ సీరియస్అయ్యారు. ల్యాబ్ ఉన్నప్పటికీ.. బయటకు రిఫర్ చేయడంతో టెక్నీషియన్(ఎల్టీ) ఎండీ యూసుఫ్అలీని సస్పెండ్ చేశారు.
ఆస్పత్రిలోని మరుగుదొడ్ల నుంచి దుర్గంధం రావడంతో వాటిని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శానిటైజేషన్ఏజెన్సీ తాళ్ల వెంకటేశ్వర్లు ఫెసిలిటీస్అండ్ మేనేజ్మెంట్కు మెమో ఇవ్వమని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. రెండు రోజుల్లో శానిటైజేషన్మెరుగుపడకుంటే ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో మనోహర్, సూపరింటెండెంట్ రాజారామ్ , మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్ రెడ్డి, అధికారులు ఉన్నారు.