- కలెక్టర్ హనుమంతు కే.జెండగే
యాదగిరిగుట్ట, వెలుగు : భారీ వర్షాలు, వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని వాగులపై నుంచి రాకపోకలను నిషేధించాలని సంబంధిత ఆఫీసర్లకు కలెక్టర్ హనుమంతు కే.జెండగే ఆదేశించారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం చొల్లేరు, మోటకొండూర్ మండలంలోని బిక్కేరు వాగులను ఆయన పరిశీలించారు.
గ్రౌండ్ లెవల్ లో విజిట్ చేసి వరద ఉధృతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేని వానల కారణంగా ముందస్తు జాగ్రత్తగా 24 గంటలు పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని సూచించారు. అదేవిధంగా బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించాలని తెలిపారు.