స్టూడెంట్స్​కు మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి  : కలెక్టర్​ హనుమంతు

యాదాద్రి, వెలుగు : ఐటీఐ స్టూడెంట్స్​కు మంచిగా ట్రైనింగ్​ఇవ్వాలని కలెక్టర్​హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. ఆలేరులోని ప్రభుత్వ ఐటీసీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోపా, డ్రాప్ట్స్ మెన్ సివిల్, ఎలక్ర్టీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మోటార్ మెకానిక్, టర్నర్, వెల్డర్ ట్రేడ్ లలో శిక్షణా కార్యక్రమాలు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ బిల్డింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. టీజీఐఐసీ ఇంజినీర్లతో మాట్లాడి అక్టోబర్​లోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్​రంగాల్లోని ఉపాధి అవకాశాలను ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి పరిస్థితులకు తగినట్లుగా ఆధునిక సాంకేతిక పద్ధతులలో ఉపాధి శిక్షణ అందించాలని సూచించారు. అనంతరం మైనార్టీ రెసిడెన్షియల్​బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను, పేరెంట్స్ విజిటింగ్ రిజిస్టర్, కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ లో ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించిన ఆయన టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చారా..? అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్​ వెంట ప్రిన్సిపాల్ లలిత, వార్డెన్ సయ్యదా ముస్కినా, సిబ్బంది ఉన్నారు.