యాదాద్రి, వెలుగు : బాలికల రెసిడెన్షియల్స్కూల్ ప్రిన్సిపాల్‌పై కలెక్టర్హనుమంతు జెండగే సీరియస్ అయ్యారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న సమయంలో స్టాఫ్నర్స్రాకుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్‌లో నెలకొన్న సమస్యలను గుర్తించడానికి రామన్నపేట మండలం జనంపల్లి రెసిడెన్షియన్స్కూల్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
అటెండెన్స్రిజిస్టర్ ను పరిశీలించి సిబ్బంది గురించి ఆరా తీశారు. స్కూల్‌కు రోజుల తరబడి స్టాఫ్నర్స్రావడం లేదని తెలిసింది. దీంతో ప్రిన్సిపాల్ ఎస్.రాజాపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే స్టేట్సోషల్వెల్ఫేర్ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడారు. స్టాఫ్ నర్స్‌ను నియమించాలని సూచించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌తో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.
జడ్పీ బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్..
జిల్లా పరిషత్స్పెషల్ఆఫీసర్గా కలెక్టర్హనుమంతు జెండగే బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ను స్పెషల్ఆఫీసర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతలను చేపట్టిన ఆయన జడ్పీకి కేటాయించిన ముగ్గురు వీఆర్ఏలను రికార్డ్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి కల్పించారు.