యాదాద్రి, వెలుగు : జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై నెలాఖరులోగా సమాచారం అందించాలని కలెక్టర్ హనుమంతు జెండగే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ విపత్తులు ఏర్పడినప్పుడు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005, రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నెలాఖరులోగా జిల్లా ప్లానింగ్ ఆఫీసర్‌కు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం విపత్తులపై తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బెన్ షాలోమ్, గంగాధర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శోభారాణి, స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ కోఆర్డినేటర్ గౌతమ్ పాల్గొన్నారు.