యాదాద్రి, వెలుగు: వానాకాలం 2022–-23 సీజన్ సీఎంఆర్నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు జెండగే ఆదేశించారు. కలెక్టరేట్లో సీఎంఆర్ సేకరణ, వడ్ల కొనుగోళ్లపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలంలో సీఎంఆర్ కోసం జిల్లాలోని 44 మిల్లులకు 2.85 లక్షల టన్నుల వడ్లు కేటాయించినట్లు ఆఫీసర్లు తెలిపారు. 1.95 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఇప్పటివరకూ 1.65 లక్షల బియ్యాన్ని మిల్లర్లు పంపించారని వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీజన్లు గడుస్తున్నా సీఎంఆర్ పెండింగ్‌లో ఉండడం సరికాదని, నెలఖారులోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. 2023-–24 సీజన్ వడ్ల కొనుగోళ్ల గురించి సివిల్సప్లై డీఎం గోపికృష్ణ మాట్లాడుతూ.. 2. 44 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్టు చెప్పారు. 20 వేల మంది రైతుల అకౌంట్లలో రూ. 430 కోట్లు జమ చేసినట్టు వివరించారు. రివ్యూ మీటింగ్లో అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కర్రావు, డీసీఎస్వో శ్రీనివాసరెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెంబర్లు వెంకటేశ్ సహా మిల్లర్లు ఉన్నారు.