ప్రజాపాలన దినోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతు జెండగే

ప్రజాపాలన దినోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : సెప్టెంబర్ 17న  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. 

సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేయాలని చెప్పారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​గంగాధర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, ఏసీపీ రవి కిరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.

పోషణ లోపం నివారించాలి..

చిన్నారుల్లో పోషణలోప నివారణ చర్యలు పటిష్టంగా తీసుకోవాలని కలెక్టర్​ హనుమంతు జెండగే సూచించారు. గుండాల మండలం ఆనంతారం పీహెచ్​సీ, కొమ్మాయిల్లిలోని సబ్ సెంటర్​ను ఆయన సందర్శించి వైద్య సేవలు, మందులు, రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జడ్పీ హైస్కూల్​ను సందర్శించి పదో తరగతి ఫిజికల్ సబ్జెక్ట్ సంబంధించిన డిజిటల్ క్లాస్ లను చూశారు. పక్కనే పాఠశాల విద్యార్థులు, అంగన్ వాడీ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ అస్సెస్మెంట్ క్యాంపును పరిశీలించారు. 

ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించాలి

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 17 న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్​లో అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 17న జిల్లా కేంద్రంతోపాటు అన్ని  గ్రామ పంచాయతీల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.