ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి: హనుమంతు

యాదాద్రి, వెలుగు: ఎలాంటి  ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె. జెండగే ప్రజలకు సూచించారు.  బుధవారం యాదాద్రి జిల్లా బీబీనగర్​లో నిర్వహించిన పోలీసు కవాతులో డీసీపీ రాజేశ్​ చంద్రతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పలువురు ఓటర్లను కలిసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.  ఇందుకోసం పోలీసుశాఖ, సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు.

అనంతరం కలెక్టరేట్​లో నిర్వహించిన  రివ్యూ మీటింగ్​మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ,  పరిశీలన, ఉపసంహరణ కీలకమైన ప్రక్రియలని , వాటిపై కుణ్ణంగా అవగాహన పెంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్లు జీ వీరారెడ్డి, ఏ భాస్కర్​రావు, ఆర్డీవో అమరేందర్​, ఏసీపీ వెంకటరెడ్డి, కమిషనర్​ నాగిరెడ్డి. సీఐ సత్యనారాయణ ఉన్నారు.

ALS0 READ: ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక‌‌