పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ : కలెక్టర్​ హనుమంతు జెండగే 

యాదాద్రి, వెలుగు : ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల ఆఫీసర్​, కలెక్టర్​ హనుమంతు జెండగే తెలిపారు. శనివారం కలెక్టరేట్‌‌లో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సీఎస్​ మహేశ్వరన్, పోలీసు అబ్జర్వర్ విపుల్​ కుమార్, ఎక్స్‌‌పెండిచర్ అబ్జర్వర్ రాకేశ్ కుమార్‌‌కు జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఆలేరు, భువనగిరి నియోజక వర్గాల్లో 401 లొకేషన్లలో 566 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని 366  సీనియర్ సిటిజెన్స్, 284 మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

3912 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.  పోటీలో ఉన్న అభ్యర్థులతో ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేశ్ చంద్ర, అడిషనల్​ కలెక్టర్లు ఏ భాస్కరరావు, జీ వీరారెడ్డి, భవనగిరి ఆర్​వో అమరేందర్ ఉన్నారు. 

సెంటర్ల పరిశీలన 

భువనగిరి, ఆలేరులోని ఎన్నికల సెంటర్​ ఏర్పాట్లను జనరల్ అబ్జర్వర్ సి.ఎన్.మహేశ్వరన్, పోలీసు అబ్జర్వర్ విపుల్ కుమార్, ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ రాకేశ్ కుమార్ పరిశీలించారు.  క్షేత్రస్థాయిలో  వీఎస్​టీ, వీవీటీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్​ఎస్​టీ బృందాలు పకడ్బందీగా పనిచేయాలని, పారదర్శకతతో కూడిన ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.

కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

నల్గొండ అర్బన్, వెలుగు :  ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఎలక్షన్ అబ్జర్వర్లు జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం తిప్పర్తి  మండలం అనిశెట్టి ధుప్పల పల్లిలోని గిడ్డంగుల సంస్థ  గోదాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ సెంటర్‌‌‌‌ను  సాధారణ పరిశీలకులు  కె.బాల సుబ్రహ్మణ్యం, అవినాష్ చం పావత్ , ఆర్.కన్నన్,  వ్యయ పరిశీలకులు సతీష్ గురు మూర్తి, డిఎం నిమ్జే, సంతోష్ కుమార్, పోలీస్ పరిశీలకులు విజయ్ సింగ్ మీనా, వినయ్ ఖన్నా , కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఎస్పీ అపూర్వరావు

రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.  కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూంలు, ఇతర ఏర్పాట్లను కలెక్టర్‌‌‌‌ను ఆరా తీశారు. అనంతరం సువిధ ఆప్‌‌ ద్వారా వాహనాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇతర విషయాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ తిరుపతయ్య, ఎస్పీడీసీఎల్‌‌ ఎస్ఈ చంద్ర మోహన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, డీపీఆర్‌‌‌‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు.