రామన్నపేట సీహెచ్​సీలో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

రామన్నపేట  సీహెచ్​సీలో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

యాదాద్రి, వెలుగు  : రామన్నపేట సీహెచ్​సీని కలెక్టర్​ ​ హనుమంతు జెండగే బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ట్రీట్​మెంట్​ కోసం ప్రభుత్వాస్పిటల్​కు వచ్చిన మహిళలతో  మాట్లాడారు. ట్రీట్​మెంట్ ​కోసం ఎక్కడి నుంచి వచ్చారు.. ? ఎన్ని రోజులుగా వస్తున్నారంటూ   ఆరా తీశారు.  ప్రసూతి వార్డు వద్ద ఓపీ కోసం వచ్చిన గర్భిణులతో మాట్లాడారు.  ఈ సీజన్​లో నీళ్లు వేడి చేసి చల్లార్చి తాగాలని సూచించారు. చల్లారిన ఆహారం తినకూడదన్నారు. అనంతరం పేషెంట్లకు అందిస్తున్న ట్రీట్​మెంట్​,   మందులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. 

ట్రీట్​మెంట్​ కోసం అవసరమైతే సీఎస్​ఆర్​ నిధుల నుంచి మంజూరు చేస్తామని, గర్భిణుల ఓపీ ఎక్కువ ఉన్నందున గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ లను నియమిస్తామని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రత, పారిశుద్యం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని, క్లోరినేషన్, బ్లీచింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డాక్టర్ చిన్నానాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర్, తహసీల్దార్​  లాల్ బహదూర్ శాస్తి, మండల అభివృద్ది అధికారి యాకూబ్ నాయక్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.