సోషల్​ మీడియాతో స్టూడెంట్లకు నష్టం : హనుమంతు జెండగే  

యాదాద్రి, వెలుగు : సోషల్​ మీడియా ప్రభావంతో స్టూడెంట్లకు నష్టం జరుగుతోందని కలెక్టర్​ హనుమంతు జెండగే చెప్పారు. బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లోని  హాస్టళ్లలో 8 వ తరగతి నుంచి ఇంటర్‌‌‌‌ చదువుతున్న స్టూడెంట్లకు బుధవారం భువనగిరిలో వ్యక్తిత్వ వికాసం, ఉన్నత లక్ష్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌ మాట్లాడుతూ..  సోషల్​మీడియాను అవసరం మేరకే వినియోగించుకోవాలని, అనవసరమైన అంశాల జోలికి పోవద్దని సూచించారు. లేదంటే సమయం వృథా కావడమే కాదు భవిష్యత్​ప్రమాదంలో పడుతుందన్నారు.

ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని చదివితే  భవిష్యత్‌‌కు  పునాది పడుతుందని వివరించారు. గొప్ప వ్యక్తుల జీవితాలను చదవాలని, చదువు, కఠోర శ్రమ ద్వారా వారు గొప్పవాళ్లుగా ఎదిగారని చెప్పారు.  ఏదైనా పని చేసేముందు మన కోసం కష్టపడే తల్లిదండ్రులను గుర్తుచేసుకోవాలని సూచించారు. వారి కలలు నిజం చేయాల్సిన బాధ్యత స్టూడెంట్లపై ఉందని స్పష్టం చేశారు.

ఈ సదస్సులో వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వర్ రావు, అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి, డీఈవో  నారాయణ రెడ్డి, ఇంటర్మిడియట్ జిల్లా అధికారి రమణి, వెల్ఫేర్​ ఆఫీసర్లు యాదయ్య, జయపాల్ రెడ్డి, కో-ఆర్డినేటర్ వెంకటేశ్వేర రెడ్డి, భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, హెచ్‌‌ఎంలు సి.రంగరాజన్, డాక్టర్​ పోరెడ్డి రంగయ్య పాల్గొన్నారు.