దేశ రక్షణలోనూ మహిళలు ముందంజ : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపిస్తూ దేశ రక్షణలోనూ ముందంజలో ఉన్నారని కలెక్టర్​ హనుమంతు జెండగే అన్నారు. గురువారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ ముందు చూపుతో మహిళలకు సమాన హక్కుల కల్పిస్తూ చాలా గొప్ప పనిచేశారని చెప్పారు. సావిత్రి బాఫూలే విశేష కృషితో మహిళలకు విద్యావకాశాలు దక్కాయని తెలిపారు. 

బ్రూణ హత్యలు, లింగనిర్దారణకు వ్యతిరేక చట్టాలు వచ్చాయని, పోక్సో చట్టం తదితర చట్టాలు మహిళలకు రక్షణగా ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు అన్వితారెడ్డిని ప్రశంసించారు.  అనంతరం మహిళల రక్షణ, హక్కులు, ప్రభుత్వాలు కల్పిస్తున్న సేవలు, సంక్షేమ పథకాల గురించి పలువురు వక్తలు వివరించారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ బండారు జయశ్రీ,  భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సీడీపీవోలు స్వరాజ్యం, జ్యోత్స్న, మహిళా ఎంపీపీలు, జడ్పీటీసీ పాల్గొన్నారు.