ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు: ఓటరు నమోదుపై 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్​ హనుమంతు జెండగే సూచించారు. భువనగిరి టౌన్​లోని బాహర్ పేట్, బీబీనగర్​లోని పోలింగ్​ సెంటర్లలోని ప్రత్యేక ఓటరు క్యాంపులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు చేస్తున్న విషయాన్ని మరింత ప్రచారం చేయాలన్నారు. 

18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫామ్​-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫామ్ 8 మార్పులకు సంబంధించి ఆబ్సెంట్, మరణించిన ఓటర్లను పరిశీలించి తొలగించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్లు అంజిరెడ్డి,  శ్రీధర్, బూత్ లెవల్ అధికారులు ఉన్నారు.