డిచ్పల్లి, ఇందల్వాయి, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం బర్దీపూర్, ఇందల్వాయి గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి తో కలిసి ఆయన కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని సెంటర్లకు తీసుకరావాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2203, బీ గ్రేడ్‌కు రూ. 2183 ధర చెల్లిస్తారన్నారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్ సప్లయ్ డీఎం జగదీశ్, ఇందల్వాయి పీఏసీఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.