నల్గొండ అర్బన్, వెలుగు: వరంగల్,- ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు.
నవంబర్ 2020 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న వారు కూడా మళ్లీ ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 6 చివరి తేదీ అని, ceotelangana.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితా , ఏప్రిల్ 4 న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు