టీజీ ఐపాస్ కింద త్వరగా పర్మిషన్లు ఇవ్వాలి : కలెక్టర్​ ప్రావీణ్య

టీజీ ఐపాస్ కింద త్వరగా పర్మిషన్లు ఇవ్వాలి : కలెక్టర్​ ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు: టీజీ ఐపాస్ పథకంలో భాగంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు త్వరగా అనుమతులు జారీ చేయాలని హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. టీ- ప్రైడ్ పథకంలో భాగంగా 15 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అనుమతులు మంజూరు చేశామని, వారికి రూ.46.49 లక్షల సబ్సిడీ మంజూరైనట్లు తెలిపారు. 

టీజీ -ఐపాస్ పథకంలో భాగంగా 43 యూనిట్లకు 71 అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిలో 51 అనుమతులు వచ్చాయన్నారు.  ఈ యూనిట్లు రూ.40.22 కోట్లతో ఏర్పాటు చేయడానికి పర్మిషన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ యూనిట్ల ద్వారా 480 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అనంతరం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. 

18 రకాలైన కులవృత్తులకు ఈ పథకం వర్తిస్తుందని, డీపీవో, మెప్మా, మున్సిపల్ అధికారులు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్ కుమార్, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన గ్రీవెన్స్​లో జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 15 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​తెలిపారు. గ్రీవెన్స్​లో డీఆర్వో గణేశ్, పరకాల ఆర్డీవో నారాయణ, అధికారులు పాల్గొన్నారు.