- వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్, వెలుగు : వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి అమ్మేందుకు వచ్చే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మార్కెటింగ్ ఆఫీసర్లతో బుధవారం కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే మూడు నెలలు మార్కెట్‍కు ఎక్కువ మొత్తంలో మిర్చి వచ్చే అవకాశం ఉందన్నారు.
మిర్చిలో తేమ శాతం తక్కువ ఉండేలా రైతులు ముందుగానే ఆరబెట్టుకొని తీసుకువస్తే ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుదన్నారు. మిర్చి క్వాలిటీ, మాయిశ్చర్ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇతర మార్కెట్లలో ధరలు, క్రయావిక్రయాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు. రివ్యూలో మార్కెటింగ్ ఆఫీసర్ పి.ప్రసాదరావు పాల్గొన్నారు.
గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారు వచ్చే నెల 6 లోగా ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. 24న డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేసి, మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్ 4న ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు.