నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలో అంధుల కోసం ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ లోని కలెక్టరేట్ లో అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధుల కోసం ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం రిజర్వేషన్ కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. దూరప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరుగురు అంధ ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
కోసం ప్రత్యేక లిపి...
సూర్యాపేట : ఆరు చుక్కలతో అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు లూయిస్ బ్రెయిల్ అని అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. కలెక్టరేట్ లో లూయిస్ బ్రెయిల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి లూయిస్బ్రెయిన్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, అధికారులు పాల్గొన్నారు.