![మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు](https://static.v6velugu.com/uploads/2025/02/collector-ila-tripathi-conducts-surprise-inspection-at-miryalaguda-government-hospital_kdcsC6nVvB.jpg)
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సోమవారం రాత్రి కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రసూతి వార్డు సహా ఇతర గదులను పరిశీలించారు. అంతకుముందు దామరచర్ల మండల కేంద్రంలోని పీహెచ్ సీని తనిఖీ చేశారు. 24 గంటల ఆస్పత్రిలో ఒక్కరే స్టాఫ్ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్, ఏఎన్ఎం, ఆయుష్ డాక్టర్ ఎక్కడి కెళ్లారని ఆరా తీశారు.
అనంతరం ఆస్పత్రిలో ఉండాల్సిన మెడిసిన్ స్టాక్‌ను పరిశీలించారు. ఉన్న స్టాక్ కు.. లెక్కలకు పొంతన లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట స్థానిక తహసీల్దార్ జవహర్ లాల్ నాయక్, పంచాయతీ కార్యదర్శి వాసుదేవరెడ్డి ఉన్నారు.