పథకాల అమలుకు పకడ్బందీ సర్వే చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

 

  • ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు 

నల్గొండ అర్బన్, వెలుగు:   రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు.  రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి నాలుగు స్కీంలు అమలు చేయనున్న దృష్ట్యా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, గ్రామసభల నిర్వహణ, అర్హుల జాబితా ఆమోదం లాంటి పనులు  పూర్తి చేయాన్నారు.  ఈనెల 16 నుంచి 20 వరకు గ్రామాల్లో  నంబరు వారీగా సర్వే చేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తించాలని  ఆదేశించారు.

ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో ప్రాధాన్య క్రమంలో లబ్ధిదారుల జాబితాను ఆమోదించాలని సూచించారు.  కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్డీఏ శేఖర్ రెడ్డి,  వ్యవసాయ శాఖ జేడీ శ్రావణ్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు