కట్టంగూర్,(నకిరేకల్) : వెలుగు ధరణి పోర్టల్ లోని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి పోర్టల్ లో వివిధ మాడ్యూల్స్ కింద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తహసీల్దార్ ప్రసాద్ కు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. మీ- సేవ దరఖాస్తులను సైతం సమీక్షించి వేగవంతం చేయాలని చెప్పారు. అనంతరం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో స్థానికంగా ప్రసవాలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ-వేస్ట్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు..
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీలో ఈ-– వేస్ట్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం నల్గొండలోని కలెక్టరేట్లో ఈ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటుపై మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.