సీఎం నల్గొండ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

సీఎం నల్గొండ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 7న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా బుధవారం కలెక్టరేట్​లో సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్థానిక రైతుబజార్ వద్ద శంకుస్థాపన చేయనున్న స్కిల్ డెవలప్​మెంట్ కేంద్రం, మున్సిపల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు.

ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు, సభకు హాజరయ్యే వీఐపీలకు ఏర్పాట్లు, హెలిప్యాడ్ తదితర అంశాలను పరిశీలించారు. బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్​లోకి డెలివరీ ఛానల్ ద్వారా నీరు వదిలేందుకు చేసిన ఏర్పాట్లు, హెలిప్యాడ్, పైలాన్ ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్​ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 7న సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2025--–26 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు.