నల్గొండలో 12 మంది పంచాయతీ ఆఫీసర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

నల్గొండలో 12 మంది పంచాయతీ ఆఫీసర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

నల్గొండ జిల్లాలో 12 మంది మండల పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులిచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.  జనరల్ ఫండ్స్ ఆగం చేశారని  కలెక్టర్ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేసేది విడిచిపెట్టి రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా కార్యదర్శులు లక్షల్లో నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. నల్లగొండ జిల్లా మొత్తం ఇదే తంత్తు అంటూ తన దగ్గర ఉన్న ఆధారాలను అధికారులకు చూపించారు జిల్లా కలెక్టర్.

ఇంటి పన్ను, ఫంక్షన్ హాల్స్ , పెట్రోల్ పంపులు, వ్యాపార సంస్థలు, కళ్యాణ లక్ష్మి ,హౌస్ రిజిస్ట్రేషన్, వెంచర్లు పై ప్రభుత్వానికి రావలసిన చలాన్లను  కట్టకుండా అక్రమాలు జరిగాయి అని మండిపడ్డారు.  డబల్ రసీదు పుస్తకాలతో అక్రమాలు జరిగినట్లు తన దగ్గర ఆధారాలున్నాయన్నారు కలెక్టర్

 మండల పంచాయతీ అధికారులు సరైన మానిటరింగ్ చేయకపోవడంతో ఆన్లైన్ లో తక్కువ చూపించి ఆఫ్లైన్ లో ఎక్కువ వసూలు చేసి అధికారులను తప్పుదోవ పట్టించారని చెప్పారు  కలెక్టర్ ఇలా త్రిపాఠి .  పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ అనుమతి లేకుండా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఎంబి రికార్డ్ ఎలా చేశారని ప్రశ్నించారు.

 నల్గొండ జిల్లాలో 868 గ్రామపంచాయతీలను 20 శాతం హౌస్ టాక్స్ కూడా చేయలేదని డమ్మీ రికార్డులతో సొంతానికి డబ్బులు వాడుకున్నట్లు  అనుమానం వ్యక్తం చేశారు కలెక్టర్.  ఇసుక, మైనింగ్ ఉన్న గ్రామపంచాయతీలో  అక్రమాలు ఎక్కువ జరిగినట్లు అనుమానించారు.  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులపై ఫైర్ కావడంతో  మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు అలర్ట్ అయ్యారు.