ప్రజా సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజా సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ తో కలిసి స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 105 దరఖాస్తులు రాగా, వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామసభలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డీపీవో వెంకయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, డీఆర్ డీఏ పీడీ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.